ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం దొరమమిడి పంచాయితీ అలివేరులో బుధవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించి, అలివేరు డ్యామ్ నుంచి రైతులకు సాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.