బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మానవతా మూర్తి సుమారు 30,000 రూపాయల విలువైన 60 ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై దుర్గ మల్లేశ్వరరావు, విద్యార్థులు అంకితభావంతో విద్యను కొనసాగించాలని సూచించారు. మానవతా మూర్తికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.