బుట్టాయగూడెం: కులధ్రువీకరణ పత్రం కోసం బాలుడు దీక్ష

4చూసినవారు
బుట్టాయగూడెం: కులధ్రువీకరణ పత్రం కోసం బాలుడు దీక్ష
తనకు కులధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జారీ చేయాలని కోరుతూ ఓ బాలుడు తన అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి బుట్టాయగూడెం తహసీల్దారు కార్యాలయం ముందు మంగళవారం నిరాహారదీక్ష చేపట్టాడు. సుమారు పదమూడేళ్ల కిందట ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని గర్భవతిని చేయడంతో జన్మించిన బాలుడికి ఇప్పటికీ జనన, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జారీ కాలేదని, దీంతో పాఠశాలలో చేరేందుకు ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మద్దతుగా నిలిచి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.