కూటమి ప్రభుత్వం వైసీపీ ఓటర్లను తొలగించే కుట్ర: తెల్లం బాలరాజు

67చూసినవారు
కూటమి ప్రభుత్వం వైసీపీ ఓటర్లను తొలగించే కుట్ర: తెల్లం బాలరాజు
కొయ్యలగూడెం వైసీపీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పొంగుటూరు, గవరవరం, చొప్ప, రామన్నగూడెం గ్రామాల్లోని పార్టీ శ్రేణులతో కలిసి సర్వే కార్యక్రమంపై బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ఓటర్లను తొలగించే విధంగా కుయుక్తులు పన్నుతోందని, దీనిని బూత్ ఏజెంట్లు ప్రాథమిక దశలోనే గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఈ సమీక్ష ఏలూరు, పోలవరం ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్