రైతులకు విత్తనాలు, దాణా పంపిణీ: ఎమ్మెల్యే బాలరాజు

1153చూసినవారు
రైతులకు విత్తనాలు, దాణా పంపిణీ: ఎమ్మెల్యే బాలరాజు
ఏలూరు, పోలవరం (పశ్చిమ గోదావరి) జిల్లాలోని బుట్టాయగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం "రైతన్న మీకోసం" కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే, సబ్సిడీపై పశువుల దాణాను కూడా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి, పశువులకు అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు.

సంబంధిత పోస్ట్