కొత్తపట్టిసీమ గ్రామంలో రైతు ఆత్మహత్యాయత్నం

1185చూసినవారు
కొత్తపట్టిసీమ గ్రామంలో రైతు ఆత్మహత్యాయత్నం
పోలవరం మండలం కొత్తపట్టిసీమ గ్రామంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంట రాధాకృష్ణ పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే పంట దిగుబడి ఆశించిన మేరకు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలో పురుగుల మందు సేవించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతడిని పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి పంపించారు.

సంబంధిత పోస్ట్