కొయ్యలగూడెంలో రైతులు, స్థానికులు నిరసన

513చూసినవారు
కొయ్యలగూడెం మండలంలో ఆయుధ కర్మాగార డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, స్థానికులు గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ, మెజారిటీ ప్రజలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని, జీలుగుమిల్లిలో నిరసనలు వ్యక్తమవ్వడంతో ఈ డిపోను ఇక్కడికి మార్చారని తెలిపారు. వ్యవసాయ భూములకు, ప్రజలకు నష్టం కలిగించే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్