బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం గ్రామంలో సోమవారం రాత్రి దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన ఊరేగింపులో పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఆయన యువకులతో కలిసి సరదాగా స్టెప్పులు వేసి ప్రజలను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.