గాంధీజీ వర్ధంతి: శ్లోక స్కూల్లో ఘన నివాళి

112చూసినవారు
గాంధీజీ వర్ధంతి: శ్లోక స్కూల్లో ఘన నివాళి
ఏలూరు జిల్లా, కుక్కునూరులోని శ్లోక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరస్పాండెంట్లు మాదినేని శ్రీను, పిచ్చుక మనోజ్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ త్యాగాలు, అహింస, సత్యం మార్గాలను విద్యార్థులకు వివరించారు. గాంధీజీ ఆశయాలను అనుసరించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించవచ్చని తెలిపారు. విద్యార్థులు గాంధీజీ ఆదర్శాలను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్