వేలేరుపాడు గ్రామంలో కొన్ని కుటుంబాలు జాతి కోళ్ల పెంపకాన్ని చిన్న పరిశ్రమలా మారుస్తున్నారు. నాటు కోళ్లకంటే జాతి కోళ్లలో ఎక్కువ లాభాలు వస్తున్నాయి. పందెం పుంజులు మాత్రమే కాకుండా కోడి గుడ్లు, ఒక రోజు లేదా కొన్ని రోజుల కోడిపిల్లలను కూడా సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తున్నారు. పుంజల ఫోటోలు, జాతి నాణ్యత చూపిస్తూ ఒక్కో గుడ్డును రూ.500 నుంచి కొన్ని ప్రత్యేక జాతుల గుడ్లను రూ.600కు విక్రయిస్తున్నారు. భీమవరం, భీమడోలు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల నుండి ఆర్డర్లు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల పెంపకదారులు ఇవి కొనుగోలు చేసి ఇంక్యుబేటర్‌లో పెట్టి కోడిపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు.