పోలవరం మండలం ఇటుకలకోట సమీపంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని, పశువుల పాకల వద్ద రాత్రిపూట లైట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. పులి కదలికల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 9440796664, 9440796663, 9440686660 నంబర్లను సంప్రదించాలని సూచించారు.