గుబ్బల మంగమ్మ భక్తులకి ముఖ్య గమనిక

1656చూసినవారు
గుబ్బల మంగమ్మ భక్తులకి ముఖ్య గమనిక
శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించే భక్తులను అటవీ పర్యావరణాన్ని పరిరక్షించమని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలు కోరాయి. అడవి కేవలం చెట్లే కాదని, అది 220కి పైగా పక్షి జాతులు, 40 విభిన్న వన్యప్రాణుల జాతులు, లెక్కలేనన్ని చిన్న జీవులకు నిలయమని వారు తెలిపారు. సందర్శకులు అడవిలోకి ప్లాస్టిక్ తీసుకురావడం, చెత్తను డబ్బాలకు వెలుపల పారవేయడం, ధూమపానం, మద్యపానం వంటివి నిషేధించబడ్డాయని ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్