శుక్రవారం, జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం నుండి జీలుగుమిల్లి వరకు సుమారు రూ. 1.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్డు మౌలిక సదుపాయాలు కీలకమని, ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.