జీలుగుమిల్లి: వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

326చూసినవారు
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం జీలుగుమిల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న సౌకర్యాలను, ముఖ్యంగా భోజన వ్యవస్థను ఆయన సమగ్రంగా పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థినులకు మెనూ ప్రకారం సరైన ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా పరిశీలించి, వంటశాలను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్