పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం కొయ్యలగూడెంలో సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇటువంటి భాష వాడే వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రామారావు అన్నారు.