కొయ్యలగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబానికి అంబటి రాంబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డులో కల్తీ జరిగిన విషయం ప్రపంచానికి తెలుసని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసభ్య పదజాలంతో మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు.