కొయ్యలగూడెం మండల టిడిపి అధ్యక్షులు పారేపల్లి నరేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గురువారం బయ్యనగూడెం గ్రామంలో ఆటో డ్రైవర్లకు రూ. 15,000 అందజేయడాన్ని వారు హర్షించారు. ఈ సందర్భంగా వారితో కలిసి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని నరేష్ పేర్కొన్నారు.