బుట్టాయిగూడెంలో రేపు ఎమ్మెల్యే పర్యటన

976చూసినవారు
బుట్టాయిగూడెంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
బుట్టాయిగూడెం మండలంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు అలివేరు ప్రాజెక్టు వద్ద రైతులకు సాగు నీటిని విడుదల చేసి, 11 గంటలకు నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 11:20కి ఆర్బికె భవనాన్ని, 11:45కి గోకులం షెడ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15కి దొరమామిడి గ్రామంలో సీసీ రోడ్లను, 2 గంటలకు లక్ష్ముడుగూడెంలో నూతన ఆర్బికెను ప్రారంభిస్తారు.
Job Suitcase

Jobs near you