పోలవరం మండలంలోని పట్టిసీమ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ శ్రీమతి కొవ్వాసు జగదీశ్వరి గారు పాల్గొన్నారు. ఆమె సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.