పోలవరం: నేలకొరిగిన వరిచేలు

3289చూసినవారు
బుధవారం పోలవరం మండలం పట్టిసీమలో రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పర్యటించారు. తుఫాన్ కారణంగా బలమైన ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటచేలను ఆయన పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.