పోలవరం: పిల్లలను పరామర్శించిన ట్రైకార్ చైర్మన్

1260చూసినవారు
పార్వతిపురం జిల్లా కురూపాం ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారిని విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ట్రై కార్ చైర్మన్, పోలవరం టిడిపి ఇన్చార్జి బొరగం శ్రీనివాసులు కేజీహెచ్ హాస్పిటల్ కు వెళ్లి పిల్లలను పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మెరుగైన వైద్యం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :