పోలవరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సోమవారం వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, దానివల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించారు.