మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై గ్రామాల్లో నిరసన జ్వాలలు

708చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై గ్రామాల్లో నిరసన జ్వాలలు
మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలవరం నియోజకవర్గం, టి. నరసాపురం మండలంలోని తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం గ్రామాల్లో ప్రజలు ఆదివారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అప్పలరాజుగూడెం కూడలిలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయాల్లో హుందాతనాన్ని విస్మరించి, వ్యక్తిగత దూషణలకు దిగడం సమంజసం కాదని వారు మండిపడ్డారు. తిరుమలదేవిపేటలో నిరసనకారులు గాంధేయ మార్గంలో నోటికి నల్ల రిబ్బన్లు ధరించి, నిశ్శబ్దంగా తమ నిరసనను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్