జర్నలిస్టులకు రూ.15 లక్షల బీమా: జనసేన నాయకుడు నవీన్

386చూసినవారు
జర్నలిస్టులకు రూ.15 లక్షల బీమా: జనసేన నాయకుడు నవీన్
పోలవరం నియోజకవర్గం, టి.నర్సాపురం మండలంలో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులకు జనసేన నాయకులు సి.హెచ్. నవీన్ అండగా నిలిచారు. టి.నర్సాపురం ప్రెస్ క్లబ్‌కు చెందిన 20 మంది సభ్యులకు తన సొంత నిధులతో రూ. 15 లక్షల విలువైన పోస్టాఫీస్ ప్రమాద బీమా పాలసీలను చేయించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, "ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులకు నా వంతు బాధ్యతగా ఈ బీమా కల్పించానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమానంగా జర్నలిస్టులు కూడా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని గుర్తు చేశారు. వారి భద్రతను చూడటం మనందరి కర్తవ్యం" అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు నవీన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్