మాదకద్రవ్యాలకు, అవినీతికి నో' చెప్పండి.. విజయ మోహన్ రావు

480చూసినవారు
మాదకద్రవ్యాలకు, అవినీతికి నో' చెప్పండి.. విజయ మోహన్ రావు
ఏలూరు జిల్లాలో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల, చీరవల్లి జెడ్పీ హై స్కూల్, రాజీవ్ నగర్ జెడ్పీ హై స్కూల్‌లలో విద్యార్థులకు 'నో టు సే డ్రగ్స్ – నో టు సే కరప్షన్' అనే అంశాలపై గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ డీజీసీఈఓ చైర్మన్ డా. సిహెచ్ విజయ మోహన్ రావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత బాల బాలికలపై ఉందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు వసంత కుమార్ బాల్యం నుంచే డ్రగ్స్‌పై అవగాహన అవసరమని, జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్