ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాల ఘటనపై సీఐటీయూ ఆందోళన

63చూసినవారు
ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాల ఘటనపై సీఐటీయూ ఆందోళన
ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాలలో స్కూల్ స్వీపర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి, కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడు దుత్తు రాంప్రసాద్‌పై వెంటనే కేసు నమోదు చేసి, ఉద్యోగం నుంచి తొలగించాలని సీఐటీయూ మండల కన్వీనర్ యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు ఉన్నాయని, విద్యార్థులు, ఉద్యోగుల భద్రత దృష్ట్యా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్