టి. నరసాపురం మండలం బందంచర్ల ఫీడర్ పరిధిలో ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయని ఈఈ పీర్ అహ్మదాన్ తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వ్యవసాయ విద్యుత్ ఉదయం 2 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.