టీ.నర్సాపురం మండలం తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలోని ఎస్సీ పేట కాలనీలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారంఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తోట లక్ష్మీనారాయణ పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, మొక్కలు నాటి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ప్రజల ఆశయాల నెరవేర్పుకోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మాధ్యాహ్నపు సురేష్, పండు, నాయుడు, శ్రీను, దుర్గారావు, వీర్రాజు, పాపచారి, వీరేషలింగం, సురేష్, పవన్, వెంకటరావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.