ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం వ్యాప్తంగా సోమవారం ఉదయం నుండి విస్తారంగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో జనజీవనం స్తంభించింది. ఉదయాన్నే పనులకు వెళ్లే శ్రామికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.