పోలియో నిర్మూలనలో అప్రమత్తత అవసరం: తోట లక్ష్మీనారాయణ

527చూసినవారు
పోలియో నిర్మూలనలో అప్రమత్తత అవసరం: తోట లక్ష్మీనారాయణ
రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియోను తరిమికొట్టామని, కానీ భవిష్యత్ తరాలకు అది మళ్ళీ సోకకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఏలూరు, పోలవరం (ప.గో) లోని తిరుమలదేవిపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో కార్యక్రమంలో చిన్నారులకు స్వయంగా వ్యాక్సిన్ వేసి ఆయన ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్