శ్రీ సత్య సాయి బాబా మంచినీటి పథకం కార్మికులకు పది నెలలుగా నిలిచిపోయిన వేతనాలు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో ఇటీవల విడుదలయ్యాయి. ఎమ్మెల్యే కృషితో ప్రభుత్వం స్పందించి, కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో వేతనాలు జమ చేసింది. దీంతో సంతోషించిన కార్మికులు జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.