చెట్టును ఢీకొని యువకుడు మృతి

137చూసినవారు
చెట్టును ఢీకొని యువకుడు మృతి
బుట్టాయగూడెం మండలం విప్పలపాడు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. నందాపురానికి చెందిన సతీష్, బుట్టాయాగూడెంలోని వైన్ షాపులో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా, అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you