వైయస్సార్ వర్ధంతి: తెడ్లం గ్రామంలో నివాళులర్పించిన నాయకులు

9చూసినవారు
వైయస్సార్ వర్ధంతి: తెడ్లం గ్రామంలో నివాళులర్పించిన నాయకులు
టి నరసాపురం మండలం తెడ్లం గ్రామంలో బుధవారం మాజీ సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి MPTC బండి వెంకటసుబ్బారావు, కొరప్రోలు రవి చంద్రశేఖర్ రెడ్డి, కొరప్రోలు భాస్కర్ రెడ్డి, కొరప్రోలు తిరుపతిరెడ్డి, యలమర్తి విజయరాజు, గంజి వీరయ్య, బచ్చు మరియన్న, కనుమూరి మరియన్న, తోట శ్రీను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచిన వైయస్సార్ సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్