
నీటి విడుదలను నిలిపివేత
పోలవరంలో, పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని రెండు పంపుల ద్వారా ప్రాజెక్టు కుడి కాలువలోకి నీటి విడుదలను గురువారం నిలిపివేసినట్లు డీఈ సురేస్బాబు తెలిపారు. ఈ సీజన్ లో జులై 3న రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపులను ప్రారంభించారు. కృష్ణానదికి వరదలు రావడంతో పంపులు నిలిపివేశారు. ఇప్పటివరకు ప్రాజెక్టు కుడికాలువ ద్వారా కృష్ణాడెల్టాకు 11.96 టీఎంసీల నీరు తరలించారు.



































