
కొయ్యలగూడెం: ఓ ఆవు అరుదైన కవల దూడలకు జననం
కొయ్యలగూడెంలో బుధవారం శంకర జాతికి చెందిన ఆవు కవల దూడలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకటి దున్న, మరొకటి పెయ్య దూడలు కావడం విశేషం. ప్రసవ సమయంలో కవల దూడలు ఉండటంతో సాధారణ ప్రసవం, శస్త్ర చికిత్సకు వీలులేకుండా పోయింది. దీంతో పశు వైద్య శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైడ్రాలిక్ ట్రాక్టర్ సహాయంతో ఆవును తలకిందులుగా వేలాడదీసి, కడుపులోనే దూడలను సరిచేసి సురక్షితంగా ప్రసవం జరిగేలా చేశారు. ఈ అరుదైన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.





































