యలమంచిలి లంకకు చెందిన పెదాసింగ్ నాగశ్రీను (26) గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీలింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న నాగశ్రీను, గతేడాది డిసెంబర్‌లో అనుషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రెండు నెలలుగా నరసాపురం లక్ష్మణేశ్వరంలో నివాసం ఉంటున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిని నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.