తాడేపల్లిగూడెం పట్టణంలో సుబ్బారావుపేట బల్బు మేడ సమీపంలో సోమవారం చెత్తకుప్పలో పసికందు తల కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జ్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సైలు వెంకటరమణ, ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, పోలీస్ జాగిలంతో దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు వెళ్లడంతో, పోలీసులు ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది.