విద్యుత్ సమస్యలపై 1912కు కాల్ చేయండి..న్యాయమూర్తి

742చూసినవారు
తాడేపల్లిగూడెం విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో శనివారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం (CGRF) నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి.సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యుత్ సమస్యలను 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలని సూచించారు. సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని, సీతమ్మధారలోని తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ నరసింహ మూర్తి, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్