ఏలూరు జీజీహెచ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, శాంతినగర్‌కు చెందిన జట్టి గంగాధర్, అతని సోదరి, స్నేహితుడి నుండి రూ.2.70 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాకే మునేంద్రనాథ్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపడంతో బాధితులు దఫదఫాలుగా డబ్బులు చెల్లించారు. ఉద్యోగం ఇప్పించకపోగా నగదు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.