ఆరోపణలు నిజం అని నిరూపిస్తే బలవన్మరణం చేసుకుంటా.. తోట గోపి

453చూసినవారు
ఆరోపణలు నిజం అని నిరూపిస్తే బలవన్మరణం చేసుకుంటా.. తోట గోపి
తాడేపల్లిగూడెం సీనియర్ నాయకులు తోట గోపి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనపై 'షాడో ఎమ్మెల్యే' అంటూ కావాలనే బురదజల్లుతున్నారని, అవగాహనారాహిత్యంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుతో తనకు మంచి స్నేహపూర్వక సంబంధాలున్నాయని, రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. ప్రజల అవసరాల కోసం ఎమ్మెల్యేతో చెబుతానని, తాను జోక్యం చేసుకోనని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే బలవన్మరణం చేసుకుంటానని ఆయన సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్