జగన్మోహన్ రెడ్డి చెత్తపుత్రుడు ఎమ్మెల్యే బొలిశెట్టి

308చూసినవారు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను దత్తపుత్రుడు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్‌ను చెత్త పుత్రుడు, ఉత్తర కుమారుడు అని పిలవాల్సి వస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలపై బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను మరోసారి దత్తపుత్రుడు అని పిలిస్తే, జగన్‌ను ఉత్తర కుమారుడు, చెత్త పుత్రుడు అని పిలవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్