ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పెంటపాడుకు చెందిన జనసేన నాయకురాలు కసిరెడ్డి మధులత నియమితులయ్యారు. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల జనసేన పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మధులత, తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకట్రాజులకు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ఆమె త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.