తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ఇటీవల జరిగిన సర్పంచుల పదవి విరమణ అభినందన సభలో ఎంపీపీ శేషులతపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో, గురువారం జరగనున్న సమావేశానికి ఎంపీపీ హాజరవుతారా లేదా అనే మీమాంస నెలకొంది. ఎంపీపీ లేకుండానే సమావేశం నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది.