చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు: మంత్రి వర్మ ప్రశంసలు

889చూసినవారు
చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు: మంత్రి వర్మ ప్రశంసలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చిరివేళ్ల సాయి మహంతీర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అతి చిన్న వయసులోనే ఈ అసోసియేషన్ ను స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్న సాయి మహంతీర్ ను మంత్రి వర్మ అభినందించారు. యువత మహంతీర్ ను ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్