తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం రాత్రి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న సుమారు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.