ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

488చూసినవారు
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రిన్సిపాల్ అశోక్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్, విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు ఈ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినందుకు విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ హిరా బట్టు, అధ్యాపకులు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్