తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కమిషనర్ ఎం. ఏసుబాబు ఆధ్వర్యంలో PGRS కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అందజేసిన అర్జీలకు కార్యాలయం నుంచి పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తి, నీటి కుళాయి పన్నులు చెల్లించి, వడ్డీ రాయితీ పొందాలని సూచించారు. పింఛన్లకు 51, ఇంజనీరింగ్ కు 4, పబ్లిక్ హెల్త్ కు 2, టిడ్కో, మెప్మాకు ఒక్కో అర్జీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.