
ఆకివీడు: ఈ మార్గంలో వెళ్లాలంటే హడల్..!
ఆకివీడు మండలం ఐ.భీమవరం నుంచి చెరుకుమిల్లి వెళ్లే రహదారి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏలూరుపాడు వంతెన వద్ద రహదారి విస్తరణ కోసం తవ్వకాలు చేపట్టి వదిలేయడంతో, రాళ్లు లేచిపోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని సరిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







































