తణుకు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

1687చూసినవారు
తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రోగులకు నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. వార్డులను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలను స్వీకరించి, సమస్యలుంటే సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్