ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి

495చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇటీవల రవీంద్రనాథ్ తల్లి వంక నాగమణి మృతి చెందడంతో, ఈ విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఆరోగ్య వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, రవీంద్రనాథ్ తండ్రి వంక సత్యనారాయణతో వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్